calender_icon.png 28 January, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగదేవి గుట్ట పరిరక్షణకు చర్యలు

28-01-2026 12:28:19 AM

అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం

తహసీల్దార్ వెంకన్న

గుట్టను పరిశీలించిన అధికారులు  

మోతె, జనవరి 27(విజయక్రాంతి): మండలంలోని ఉర్లుగొండ రెవెన్యూ గ్రామ పరిధిలోగల తుమ్మగూడెం సమీపంలోని గంగదేవిగుట్టను కొందరు అక్రమార్కులు ఆక్రమిస్తుండడంతో మంగళవారం విజయక్రాంతి దినపత్రికలో ‘స్వాహాకార్యం శూన్యం’ పేరిట కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. దీనికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ వెంకన్న, సర్వేయర్, గిర్దావర్ కరుణాకర్‌రెడ్డిలతో కలిసి గుట్టను పరిశీలించారు. గుట్టను చదును చేసిన విషయాన్ని గమనించి దీనిని ఎవరు ఆక్రమిం చిన సహించేది లేదని, వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతం కాకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారుల వెంట జీపీఓ గంగులు ఉన్నారు.