calender_icon.png 21 November, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం

21-11-2025 12:58:21 AM

చేవెళ్ల, నవంబర్ 20: మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత విమర్శించారు.గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మమత హాజరై మాట్లాడుతూ .... మహిళలకు రక్షణ కల్పించడం లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని అగ్ర హం వ్యక్తం చేసారు.

షి టీమ్స్ ఎక్కడ కూడా సరిగ్గా పని చేయడం లేదని మహిళల పై హత్యచారాలు రోజు రోజు కి పెరిగి పోతున్నాయని.. వాటిని అరికట్టడం లో కేంద్ర,  రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం డి అధికంగా హత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని, భేటీ బచావో...బేటి పడా వో... అని నినాదాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు పనికి వస్తున్నాయని విమర్శలు గుప్పించారు. 

ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలలో హత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టింపు లేదనన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  కె వై ప్రణ య్, బి. శంకర్,  ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు , శ్రీకాంత్, తరంగ్, ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు, శ్రీనివాస్ , సహాయ కార్యద ర్శి, చరణ్ గౌడ్, ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, సింధు, వంశీ,ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల మండల అధ్యక్ష కార్యదర్శు , ఇర్ఫాన్, మాల చందు, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ సభ్యులు యశ్వంత్, పవన్ కుమార్, విష్ణు, నవీన్, విష్ణు గుప్త, తదితరులు పాల్గొన్నారు.