calender_icon.png 12 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మేంద్ర మృతి అంటూ ఫేక్ న్యూస్

12-11-2025 01:17:16 AM

ఆయన సతీమణి హేమామాలిని ఆగ్రహం

ముంబై, నవంబర్ 11: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిచెందారని సోమవారం రాత్రి నుంచి వెలువడిన వార్తలను ఆయన సతీమణి, ప్రముఖ నటి హేమా మాలిని కొట్టివేశారు. ఫేక్ న్యూస్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు బాధ్యత మరచి అబద్ధపు వార్తలు ప్రచురించడం సరికాదని మండిపడ్టారు. మరోవైపు ‘నాన్న క్షేమంగా ఉన్నారు.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయ న ఆరోగ్యం నిలకడగా ఉంది’. అని ధర్మేంద్ర కుమార్తె, సినీ నటి ఈషాడియోల్ ప్రకటించారు.