12-11-2025 12:38:16 AM
దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న పీరియాడికల్ డ్రామా ‘కాంత’. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయకి భాగ్యశ్రీ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
రవితేజ, విజయ్ దేవరకొండ, ఇప్పుడు దుల్కర్ సల్మాన్.. -కెరీర్ బిగినింగ్‌లోనే ఇంత మంచి స్టార్స్‌తో పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ‘కాంత’లో దుల్కర్, రానాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది. -ఇప్పటివరకు నన్ను ఒక కమర్షియల్ పెర్ఫార్మర్ అన్నారు. ‘కాంత’ తర్వాత భాగ్యశ్రీని ఒక పర్ఫార్మర్ కూడా అంటారని ఆశిస్తున్నా.
నేను అన్నిటికన్నా ముందు విన్నది ‘కాంత’ కథే. ‘కాంత’లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నాలాంటి కొత్తవాళ్లకు ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టం. సవాలుగా తీసుకొని, ‘కుమారి’ క్యారెక్టర్‌కు ఏం కావాలో గ్రౌండ్ వర్క్ చేశా. 1960 టైమ్స్‌ని రీ క్రియేట్ చేయడం చాలా టఫ్ జాబ్. ఈ సినిమా కోసం పాత తెలుగు, తమిళ్ సినిమాలు చూశాను. శ్రీదేవి, సావిత్రి నటన గమనించాను. ఆ స్ఫూర్తి తో నటించగలిగా.
నేను నటించిన ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వరుసగా వస్తున్నాయి చాలా ఎక్సయిట్‌గానూ, నెర్వస్‌గానూ ఉంది. నా వరకు 100% కష్టపడ్డాను. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని నమ్ముతున్నా.
‘కాంత’.. సినిమాలో సినిమా ఉంటుంది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక సినీ అభిమాని బయోపిక్. ఈ రెండూ దేనికవే విభిన్నమైన సినిమాలు. ‘కాంత’లో కుమారి పాత్రకు ‘ఆంధ్ర కింగ్’లో మహాలక్ష్మి క్యారెక్టర్‌కు అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకం. రెండు సినిమాలూ ప్రేక్షకులను అలరిస్తాయని నమ్ముతున్నా.
నటీనటులకు భాషా హద్దులు ఉండవు. ‘కాంత’తో తమిళ్‌లో కూడా పరిచయం అవుతున్నా. మంచి స్క్రిప్ట్స్ ఉంటే అక్కడ కూడా చేస్తా. అయితే నా మొదటి ప్రాధా న్యం తెలుగుకే. నా కొత్త సినిమాలు.. -తెలుగు, హిందీల్లో ఉన్నాయి. మిగతా ప్రాజె క్టుల గురించి మేకర్స్ ప్రకటిస్తారు.