12-07-2025 12:10:48 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వరం క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొండపైకి ఎక్కేందుకు వీలుగా ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్, ఈవో పాలక మండల సభ్యుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిబిఎం ట్రస్ట్ నుంచి డాక్టర్ చిక్కుడు అనురాధ ఆర్థిక సహాకారంతో రెండు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అనురాధమ్మ దంపతులు ప్రతేక పూజల అనంతరం బస్సులను ఆలయ కమిటీకి అందజేశారు. ఉమామహేశ్వర దేవస్థానాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం ఎప్పటికి ఉంటుందన్నారు.