12-07-2025 12:18:45 AM
ఖమ్మం,(విజయక్రాంతి): సదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం నగరంలోని పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశేట్టిని, రాజ్యసభ సభ్యురాలు రేణుకచౌదరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి లను కలసి వినతి పత్రం అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ,రఘునాధపాలేం మండలం వివెకంటాయపాలేం రెవెన్యూగ్రామాల పరిధిలో పలు సర్వే నెంబర్లో23.02 ఎకరాల ప్రభుత్వ స్దలాన్ని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు కేటాయించిందని దీనికి అప్పటి ప్రభుత్వ క్యాబినెట్ అమోద ముద్ర వేసిన తరువాత ప్రభుత్వం జీవో నూ కూడా జారిచేసిందన్నారు.
ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో అప్పట్లో ఆ పక్రియ నిలిచిపోయిందని వివరించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వడం లేదని పలువురు జర్నలిస్టులు తమ అవేదనను వెల్లబుచ్చారు. హైద్రాబాద్ నగరంలోని జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సోసైటికి సంబంధించి సుఫ్రింకోర్టు తీర్పు ఇస్తే దానిని కూడా ఖమ్మం జర్నలిస్టు హౌజింగ్ సోసైటికి అనువయించి ఒక సాకుగా చూపిస్తూ పెండింగ్ లో పెట్టి నాన్చుతున్నారని, ఇది సి ఎం హామి క్రింద జారీ అయిన జివో కనుక మరోసారి మా సమస్యను పరిష్కరించి ఖమ్మం సెగ్మెంట్లో ని జర్నలిస్టులకు న్యాయం చేయాలని వారిని కు విజ్ణప్తి చేశారు. సమస్య పరిష్కారానికి తప్పక కృషి చేస్తామని వారు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.