12-07-2025 12:26:15 AM
తనిఖీ చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
ఎస్సీ డీడీ దుర్గా ప్రసాద్
చెన్నూర్: వర్షా కాలంలో అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థులకు విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని ఇంచార్జీ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ ఆదేశించారు. నియోజక వర్గంలోని భీమారం ఎస్సీ బాలుర హాస్టల్, చెన్నూర్ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలతో పాటు కోటపల్లి ఎస్సీ బాలుర వసతి గృహాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు సమకూర్చిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గదులను, రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట భీమారం బాలుర హాస్టల్ వార్డెన్ ఎన్ మల్లేశ్, చెన్నూర్ ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ కే సుభద్ర, చెన్నూర్