calender_icon.png 23 November, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొయ్యలను కాలుస్తూ.. మంటల్లో చిక్కుకొని రైతు మృతి

23-11-2025 12:28:52 AM

మెదక్ జిల్లా పొడిచన్‌పల్లిలో ఘటన

పాపన్నపేట, నవంబర్ 22: పొలం వద్ద వరి కొయ్యలను కాల్చుతూ.. మంటల్లో చిక్కుకొని రైతు మృతి చెందిన ఘటన మె దక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్ పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుం ది. పొడిచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు బగుడం నర్సింలు(47).. శనివారం మధ్యా హ్నం తన భార్యతో కలిసి పొలంలో వరి కొయ్యలను కాల్చి వేయడానికి మంట పెట్టా డు.

ఆ మంట వీరి పొలంతో పాటు పక్క పొలంలోకి వెళ్లడంతో నర్సింలు ఆర్పే ప్రయ త్నం చేశాడు. కాలు సరిగ్గా లేక నడవలేని పరిస్థితి ఉన్న నర్సింలు.. మంటలు ఆర్పుతూ అదే మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో తల, శరీరానికి మంటలు అంటుకొని తీవ్ర గా యాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

కాసేపటికి భార్య సులోచన గమనించి స్థానికులకు సమాచారం అందించ డంతో వారు అక్కడికి చేరుకొని పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పం చనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సులోచన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.