calender_icon.png 23 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్

23-11-2025 12:30:22 AM

  1. ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి: సీపీ సజ్జనార్
  2. చార్మినార్ వద్ద జాగృత్.. సురక్షిత హైదరాబాద్ ర్యాలీ

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి) : ‘ప్రజల భయం, అత్యాశను పెట్టుబడిగా మార్చుకునే సైబర్ నేరగా ళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, స్వీయ అవగాహనతోనే ఈ నేరాలను అరికట్టగలరు’ అని హైదరాబాద్ నగర పోలీస్ కమి షనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన ‘జాగృత్ హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్’ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్ర మంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్, ఇతర పోలీసు అధికారులతో కలిసి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు సైబర్ నేరాల నివారణ కరపత్రాలను పంపిణీ చేశా రు. అనంతరం చార్మినార్ నుంచి మదీనా వరకు ఏర్పాటు చేసిన భారీ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో సైబర్ భ ద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

హైదరాబాద్‌ను సైబర్ క్రైమ్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి మంగళ, శనివారాల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని సీపీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను అరికట్టగలమని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు సైబర్ సింబా లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింబా తయారై, తమ కుటుంబాన్ని, సమాజాన్ని సైబర్ మో సాల నుంచి రక్షించుకోవాలని ఆయన ఆ కాంక్షించారు.

సోషల్ మీడియాలో ప్రైవేట్ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు పెట్టవద్దని, అలా చేయడం వల్ల మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, యువతులు అపరిచితులతో చాటింగ్ చేస్తూ బాధితులుగా మారు తున్నారని, తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇచ్చేముందే తగు జాగ్రత్తలు చెప్పాలని సూ చించారు.

వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల వారి పిల్లలు అప్రమత్తంగా ఉండాలని హె చ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెం టనే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు.