calender_icon.png 31 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి

26-07-2024 02:58:35 PM

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: తన సొంత పొలంలో కరిగెట కోసం పొలం చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి రైతు అక్కడక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సింగారపు స్వామి (33) అనే రైతు తన సొంత పొలంలో కరిగెట కోసం పొలం చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.