23-08-2025 12:45:18 AM
సూర్యాపేట, ఆగస్టు 22 (విజయక్రాంతి) : జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సమగ్ర శిక్ష, అలీంకో సంస్థ ఆధ్వర్యంలో 1నుండి 18 సంవత్సరాల లోపు దివ్యాంగ చిన్నారులకు అవసరమయ్యే ఉప కరణాల నిర్ధారణ ఉచిత వైద్య శిబిరం నిర్వ హించారు. ఈ శిబిరంను జిల్లా కోఆర్డినేటర్ యర్రంశెట్టి రాంబాబు ప్రారంభించి మాట్లా డారు.
ఈ శిబిరంలో తిరుమలగిరి, తుంగ తుర్తి , నాగారం మండలాలలోని ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ చిన్నారులు 50 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలీంకో సంస్థ వారు వివిధ కేటగిరీలు గల దివ్యాంగ చిన్నారులకు చేసిన వైద్య పరీక్షల కు సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశారన్నారు. తదుపరి ఈ క్యాంప్ ను నేడు కోదాడలో, 25న సూర్యాపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ శిబిరంకు హాజరు కాని ఈ మూడు మండలాలకు చెందిన దివ్యాంగ చిన్నారులు కోదాడ, సూ ర్యాపేటలలో ఎక్కడైనా హాజరు కావచ్చ న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాధికారి ఐ.శాంతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ కే బిక్షపతి, ఐఆర్పిలు వాణి, ఉపేందర్, బాషా, మురళీధర్, అప్పారావు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.