23-08-2025 12:46:00 AM
ఘట్ కేసర్, ఆగస్టు 22 : విద్యార్థులకు ఉపగ్రహ ఉపయోగాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నదని పిజెవికెఎస్ రెసిడెంట్ ఎక్స్పర్ట్, ఇన్ స్పేస్, ఇస్రో డాక్టర్ ప్రకాశరావు అన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం,అనురాగ్ ఉపగ్రహ పరిశోధనశాల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ స్పేస్ డే కార్యక్రమమును నిర్వహించారు. జాతీయ స్పేస్ డే ని పురస్కరించుకొని ఉపగ్రహ వివిధ విభాగాల పనితీరు, అభివృద్ధి , ఉపగ్రహ ఉపయోగాలు మరియు ఉపగ్రహ విభాగాలు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రకాశరావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు ఉపగ్రహ ఉపయోగాలు, ఉపగ్రహ వివిధ విభాగాల పనితీరు మరియు ఉపగ్రహం ఎదుర్కొనే అనుకూల, ప్రతికూల పరిస్థితుల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం, ఈసీఈ డాక్టర్ ప్రొఫెసర్ ఎన్. మంగళ గౌరీ, డాక్టర్ ఎం.నారాయణ, డైరెక్టర్ అనురాగ్ సాట్, డాక్టర్ పి .విశ్వనాధ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ సాట్, ప్రొఫెసర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎంబీఏ, మొహమ్మద్ అక్రమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీ. జే.ఐ.టి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులుపాల్గొన్నారు.