calender_icon.png 3 September, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు

02-09-2025 06:05:10 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): ఎరువుల కొరతతో రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీన్మార్ మల్లన్న జేఏసీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆయన మండలంలోని జంగేడు గ్రామ సహకార వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం నిల్చున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని రైతులు పంటలు వేసుకుని ఎరువుల కోసం వ్యవసాయ కేంద్రంలో చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. ఒక్కో రైతుకు 10 నుండి 20 బస్తాలు అవసరం ఉండగా ఒక బస్తా మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలని లేనియెడల పె…