02-09-2025 05:56:25 PM
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
దండేపల్లి,(విజయక్రాంతి): గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వరదతో మంచిర్యాల నియోజక వర్గంలో పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. మంగళ వారం దండేపల్లి మండలంలోని గోదావరి నది సమీప గుడిరేవు, లక్ష్మీ కాంతపూర్ గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే స్పందించి ఎకరానికి 40 వేల రూపాయల నష్ట పరిహారం అందించాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.