01-05-2025 01:10:26 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 30: భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై బుధవారంరాజేంద్రనగర్ డివిజన్ సర్కిల్ పరిధిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూలర్ డెవలప్మెంట్ కార్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని, పెండింగ్ లో ఉన్న సాదా బై నామా సహా వివిధ రకాల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ ఓ ఆర్ చట్టం ప్రజలకు మేలు చేకూరుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకట్ రెడ్డి, తహసీల్దార్ బొమ్మల రాములు, వివిధ గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.