01-05-2025 01:11:47 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి ): అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందిస్తున్న అత్యాధునిక స్ప్రింట్ డయాగ్నోస్టిక్ తమ 6వ శాఖను సుచిత్ర సర్కిల్ (రాంరాజ్ నగర్)లో ప్రారంభించింది. హైదరాబాద్‌లో విశ్వసనీయతతో కూడిన ప్రముఖ డయాగ్నొస్టిక్‌గా స్ప్రింట్ డయాగ్నొస్టిక్స్ సేవలందిస్తోంది. సుచిత్రలో ప్రారంభించిన కొత్త బ్రాంచీ మెయిన్ రోడ్, రామ్‌రాజ్ కాలనీ పక్కన, గేట్ నం.2లో ఏర్పాటు చేశారు.
ప్రా రం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య తిథిలుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌ డ్, బీఎస్‌ఆర్ పౌల్ట్రీ ఫామ్స్ డైరెక్టర్ డీ బ్రహ్మానంద రెడ్డి, చెరుకుపల్లి భారతసింహారెడ్డి గారు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నొస్టిక్స్ ఎండీ డాక్టర్ భరత్‌రెడ్డి మా ట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి కచ్చితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రీ మియం డయాగ్నొస్టిక్ సేవలు అందించడ మే తమ లక్ష్యమన్నారు.
సుచిత్ర సెంటర్‌లో బ్రాంచ్ ప్రా రంభించడం వల్ల ఉత్తర హైదరాబాద్ ప్రజలకు మరింత సమీపంగా సేవలు అందించబోతున్నామన్నారు. ఎమ్మె ల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి ఆరోగ్య సేవలు ఎంతో కీలకమని చెప్పారు. మారుతు న్న జీవనశైలి వల్ల కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి.. మనిషిని బట్టి చికిత్స మారుతోంది.. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయిందన్నారు.
స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సీవోవో తరుణ్ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నాణ్యమై న సేవలను అందించడమే లక్ష్యంగా సుచిత్ర స ర్కిల్ నందు ప్రాంభించడం జరిగింది. స్ప్రింట్ డయాగ్నొస్టిక్స్ ఇప్పటికే జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఏఎస్ రావు నగర్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర్లో, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా ప్రాంతాల్లో సేవలందిస్తోంది.