26-07-2025 12:00:00 AM
జిల్లాలో 344 ఫర్టిలైజర్ దుకాణాలు
మూడంచెలుగా తనిఖీలు...
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు: కలెక్టర్
మంచిర్యాల, జూలై 25 (విజయక్రాంతి): ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి ఉపయోగించేందుకు అందించే రాయితీ యూరి యా వ్యవసాయేతర అవసరాలకు వినియోగమవుతున్నదన్న ఆరోపణల మేరకు అరిక ట్టేందుకు ద)ష్టి సారించింది.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 21న (సోమవా రం) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా ఉంచేందుకు టాస్క్ బృందాలను ఏర్పాటు తనిఖీలు ప్రారంభించింది.
వ్యవసాయేతర వినియోగంపై చర్యలకు ఆదేశాలు...
ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా రాయితీ యూరియాను రైతులకు అందిస్తుం ది. ఇదే అదనుగా నకిలీ యూరియాను త యారుచేసి విక్రయించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, రాయితీ యూరియాను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న విషయంపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాల్స్, దుకాణాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలపై తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
జిల్లాలో 344 ఫర్టిలైజర్ దుకాణాలు
జిల్లాలోని 18 మండలాల్లో పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా, ప్రైవేటు కలిపి మొత్తం 344 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. దండేపల్లి మండలంలో 37, లక్షెట్టిపేటలో 31, జన్నారంలో 24, హాజీపూర్ లో 17, మంచిర్యాలలో 10, నస్పూర్ లో ఒకటి, బెల్లంపల్లిలో 11, కాసిపేటలో 11, తాండూరులో 18, భీమినిలో 15, కన్నెపల్లిలో 26, నెన్నెలలో 18, వేమనపల్లిలో 18, చెన్నూర్ లో 50, భీమారంలో 13, జైపూర్ లో 12, కోటపల్లిలో 20, మందమర్రి మండలంలో 12 ఎరువుల దుకాణాలున్నాయి.
అనుమానిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జిల్లాలో బృందాల వారిగా తమ పరిధిలోని అనుమానిత తయారీ కేంద్రాలు, అనధికారిక డీఈఎఫ్ (డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయి డ్) కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించనున్నారు. డీఈఎఫ్ అనేది యూరియా మాదిరిగా ఉండే డియోనైజ్ నీటి మిశ్రమం.
దీనిని ప్రధానంగా డీజిల్ ఇంజిన్‌లలో నైట్రోజన్ ఆక్సుడ్‌ను తగ్గించేందుకు ఉపయోగిస్తుంటారు. డీఈఎఫ్ యూ రియా మాదిరిగా ఉండటం వల్ల కొంత మం ది వ్యాపారులు అమాయక రైతులకు అంటగట్టే అవకాశం ఉండటంతో డీఈఎఫ్‌పై బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
మూడంచెలుగా తనిఖీలు...
జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుం డా నివారించేందుకు మూడంచెలు (మండల, డివిజన్, జిల్లాస్థాయి బృందాలు)గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండల స్థాయి బృందంలో తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండగా డివిజన్ స్థాయి బృందంలో ఆర్డీవో, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ), ఏసీపీలు, జిల్లా స్థాయి బృందంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ), డీసీపీలు ఉన్నారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
తనిఖీల సమయంలో అనుమా నిత యూరియా నిల్వలు, డీఈఎఫ్ లభించినట్లయితే స్వాధీన పరుచుకోవాలని బృంద సభ్యులను ఆదేశించాం. పట్టుబడిన యూరియాకు వేప నూనె పూత ఉంటే వెంటనే పరీక్షలకు ల్యాబ్ కు పం పించాలని, నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
అలాగే బృంద సభ్యులు తనిఖీ చేసిన నివేదికలు ప్రతి వారం జిల్లా వ్యవసాయ అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి. రైతులు ఎరువులు కొనుగోలు చేస్తే తప్పకుండా రశీదు పొందాలి.
కుమార్ దీపక్, కలెక్టర్, మంచిర్యాల