calender_icon.png 19 August, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పంటలు బాగా పండాలి

19-08-2025 12:00:00 AM

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

గజ్వేల్, ఆగస్టు 18: రైతులు బంగారు పంటలు పండించి గతంలో కన్నా అధిక లాభాలను పొందాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నారు.  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి బాట లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవానికి హాజరైన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  భారీ వర్షాలతో చెరువులు కుంటలు అన్ని నిండుతున్నాయని, రైతులకు పంటలు కూడా బాగా భారీగా దిగుబడులు రావాలని దేవున్ని ప్రార్థించామన్నారు. గతంలో కన్నా మరింత ఎక్కువ స్థాయిలో రైతులకు లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు. బాట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, మనోహరాబాద్ మాజీ సర్పం మహిపాల్ రెడ్డి,  మాజీ సర్పం భాను ప్రకాష్ రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు. అలాగే మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు లు స్వామివారిని దర్శించుకున్నారు.