25-12-2025 02:38:35 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలం లోని రుద్రారం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనలపై మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మానవీయ స్పందన చూపారు.
ఉపసర్పంచ్ పెద్ద బోయిన విఠల్ సతీమణి సావిత్రి, అలాగే సాల్మన్ కూతురు అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను బుధవారం ఆయన స్వయంగా పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ సర్పంచ్ సాందీప భగవత్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కోఆర్డినేటర్ రాము తదితరులు గ్రామస్తులున్నారు.