26-08-2025 02:10:38 AM
-ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిర్మూళిద్దాం... పర్యావరణాన్ని రక్షిచుకుందాం ...* ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంతో జలాలు కలుషితం
-కనిపించని మట్టి విగ్రహాలు
-వినాయకచవితి సందర్భంగా జిల్లాకు విచ్చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు
-వేలలో ఖర్చు చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం .
గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడంలో మండల నిర్వహకులు ఎక్కువ ఆసక్తిని చూ పుతున్నారు. మట్టి గణపతిలను పూజిద్దాం అని ఎన్ని ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తున్న మండపా ల నిర్వహకుల మధ్యలో ఫోటీతత్వం పెరిగిపోతూ రంగు రంగుల గణపయ్యలు ప్రతి ష్టిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన కనీస భాద్యతను విస్మరిస్తున్నారు. ఇక పర్యావరణాన్ని కాపాడే భాద్యత ముల్లోకాలకు ఆది పూజ్యుడైన గణపయ్యనే తీసుకోవాలి.
వనపర్తి, ఆగస్టు 25 ( విజయక్రాంతి ) : గణేష్ నవరాత్రుల పండుగ వస్తుందంటేనే వారం రోజుల ముందే నుండే హడావిడి గ్రా మాలలో, పట్టణాలలో మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా గణేష్ ఉత్సవాల లో పాలు పంచుకోవడం ఆనవాయితిగా వస్తుంది.
గతంలో గ్రామంలో ఒకటి చొప్పు న ఒక గణపయ్యను అది కూడా మట్టి గణపయ్యను మండపాలలో కొలువు తీర్చేవారు. రాను రాను విగ్రహాల తయారీలో రంగు రంగుల గణపయ్యలు మార్కె ట్లోకి రావడంతో మట్టి గణపతుల ప్రతిమల దర్శనం కనుమరుగు అవుతుంది.
ఫోటీత త్వం పెరగడంతో మిగితా మండపాల కన్నా పెద్దదిగా పెట్టాలి మరింత అందంగా కనిపించాలంటూ హైదారాబాద్ వంటి మహాన గరాలకు వెళ్లి మండపాల నిర్వాహకులు వేల రూపాయల ఖర్చు పెడుతూ రసాయనాల మిశ్రమాలు కలిసిన గణపయ్యలను కొనుగోలు చేస్తూ ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణప య్యలను నీటిలో నిమజ్జనం చేయడం వలన కలిగే నష్టాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదంటూ పర్యావరణ ప్రేమికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ముల్లోకాలకు ఆది పూజ్యుడైన గణపయ్య ...
మహా శివుడు లేని సమయంలో పార్వతి దేవి వినాయకుడిని రూపాన్ని సహజసిద్ధమైన నులుగుతో తీర్చిదిద్దింది. అందుకోసం ఎలాంటి రంగులు పూయనప్పటికి ముల్లోకాలకు ఆది పూజ్యుడుగా పూజలను అందు కుంటున్నాడు.
ఏ శుభకార్యం చేసిన సహజసిద్ధంగా లేదా పసుపుతో ఒక చిన్నపాటి ముద్దగా వినాయకుని ప్రతిమను తయారు చేసి ఆయనకు మొదటగా పూజలు నిర్వహించిన తర్వాతనే మిగితా దేవాదితులకు పూజ లు నిర్వహించడం ఆనవాయితి. అలాంటి అధిపతికి రంగు రంగులను అద్దుతూ వినాయకునికి నీటిలో నిమజ్జనం చేయడం వలన చెరువులు, కుంటలు, వాగులు, వంటివి కలుషితంమయ్యి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి విగ్రహాలే ముద్దు అంటూ అనే నినాదం విగ్రహాలు తయారు చేసే వారికి వినిపించడంలేదా అం టూ పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్లను మండపాల నిర్వాహకులు ప్రా రంభం చేస్తున్నారు.
ఈ హడావిడిలో ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ఎంత ప్రమాదమో పట్టించుకోవడం లేదు. నిమజ్జనం సమయంలో దేవుడి సమక్షంలో చెరువులు, వాగులలోని ప్రాణులు ఆర్ధాంతరంగా ప్రాణాలను విడుస్తున్నాయి. రసాయ నాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల కళ్లు, శ్వాసకోస సంబందిత వ్యాధులకు గురుతువారు.
అంతేకాకుండా జలచర జీవులన్ని పూర్తిగా నీరసించి చనిపోయే ప్రమాదాలు మెండుగా ఉన్నాయి. నీటిలో రసాయనాల విగ్రహాలు కలవడం వల్ల నీరు మొత్తం కలుషితం అవుతుంది. ప్రస్తుతం వినాయకుని విగ్రహాలకు వాడుతున్న రంగు పరిశ్రమల్లో వాడే రసాయనాలతో కూడినవే. ఈ రంగుల్లో భారీ లోహాలైన లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, కాల్షి యం, అధిక మోతాదుల్లో ఉండడం వల్ల నీరు కలుషిత మానవులతో పాటు జీవ చరాలకు తీవ్ర హాని కలిగిస్తాయి.
మట్టి గణపతి ని పూజిద్దాం... పర్యావరణంను కాపాడుకుందాం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యా వరణం కలుషి తం కావడం తో పాటు కంటికి కనపడిన జీవ రాశులు చనిపోతాయి. నీరు కలుషితం కావడం వల్ల మనుషులకు సైతం రోగా లు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటా యి. మట్టి గణపతి పత్రిష్ట వల్ల నీరు కలుషితం కాకుండా అందులో ఉండే జల జీవ రాశులకు ఎలాంటి ప్రాణహాని ఉండదు
పర్యావరణ పరిరక్షుడు, సామజిక వేత్త కృష్ణ సాగర్, వనపర్తి జిల్లా