30-08-2025 12:00:00 AM
అర్మూర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి) : ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి, జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1086 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది.
80 టీఎంసీలకు గాను సుమారు 63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 4.50 లక్షల టిఎంసిల వరదనీరు వస్తుండగా 5. 72 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. 39 గేట్ల ద్వారా ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీటిని, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని, ఎస్కేప్ గేట్ల ద్వారా ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.