calender_icon.png 6 July, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయాలి

05-07-2025 07:52:36 PM

కిసాన్ సాంగ్ జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి..

తాడ్వాయి (విజయక్రాంతి): రైతుల రుణాలు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్(Bharatiya Kisan Sangh) నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రైతులందరి రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని తెలిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ రెడ్డి సభ్యులు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.