05-07-2025 07:52:49 PM
మణికొండ: శనివారం మణికొండ మున్సిపల్ పరిధిలో కమీషనర్ ప్రదీప్ కుమార్ అధ్యక్షతన, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ చేతుల మీదగా వివిధ వార్డులలో మొత్తం 7 కోట్ల, 52 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 42 లక్షల ఖర్చుతో నిర్మించిన 18వ వార్డు లోని శివ నగర్ కమ్యూనిటీ హాల్, 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 13 వ వార్డు లోని మణికొండ మర్రిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్, రూ.75 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన 7వ వార్డు లోని స్పెక్ట్రం విల్లాస్ వద్ద ఏర్పాటు చేసిన బాక్స్ కలవాట్, రూ.50 లక్షల ఖర్చుతో నిర్మించిన 6వ వార్డు అలిజాపూర్ రోడ్డు లో సెంట్రల్ మీడియాన్ని, రూ.60 లక్షల వ్యయంతో 17 వ వార్డు లోని తీర్చిదిద్దిన తిరుమల హిల్స్ పార్క్, 1కోటి 25 లక్షల రూపాయలతో నిర్మించిన 14 వ వార్డు లోని శివాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే కోటి రూపాయల ఖర్చుతో ఆల్కపూర్ పార్క్ -1 లో జరుగుతున్న వాల్ పెయింటింగ్స్, అభివృద్ధి పనులను పరిశీలించారు. వెంకటేశ్వర కాలనీలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు.