30-08-2025 02:00:08 AM
-విద్యుత్ స్తంభాలు, వైర్లు మోయాల్సిన అవసరం లేదు
- డి.డి.కట్టిన 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి
- రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, ఆగస్టు 29 ( విజయక్రాంతి ) : రైతులు తమ బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ తీసుకోడానికి విద్యుత్ శాఖకు నిబం ధనల ప్రకారం డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే చాలని, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం మంత్రి వనపర్తి జిల్లా పానగల్ మండలం, చిన్నంబావి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం కుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూ జ చేశారు.
పానగల్ మండలం దావాజిపల్లి గ్రామంలో రూ. 196.83 లక్షల వ్యయంతో నిర్మించనున్న 33/11 కే.వి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంఖుస్థాపన చేశారు. అదే గ్రామం లో బుచ్చమ్మ అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటికి భూమి పూజ చేశారు. చిన్నం బావి మండలములో అయ్యవారి పల్లి గ్రా మ పరిధిలో ఒక 33/11 కెవి సబ్ స్టేషన్ ను శంఖుస్థాపన చేశారు. చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ. ఒక కోటి వ్యయంతో దేవాలయ నిర్మాణం, ప ర్యాటక శాఖ నిధులు రూ. 3.00 కోట్ల వ్య యంతో నిర్మించనున్న మల్టీలెవల్ కల్చరల్ ఆడిటోరియం పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇంటికి భూమి పూ జ సైతం చేశారు.
అయ్యవారి పల్లి గ్రామం లో అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ చే శారు. అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు మంత్రి చేతుల మీదు గా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సి.యం. రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం అందజేసారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్ఫార్మర్, సరిపడ విద్యుత్ స్తం భాలు, కాసారాలు, ఇతర సామాగ్రిని కార్వాక్టర్లకు ఇచ్చి పని చేసినందుకు డబ్బులు కూ డా మంజూరు చేయడం జరుగుతుందని కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే రైతు స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లు కొని స్తంబాలు సై తం మోస్తున్నాడని దిగ్బ్రతి వ్యక్తం చేశారు.
రై తు డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే నిర్ణిత గడువు 60 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇచ్చే బాధ్యత విద్యుత్ శాఖదే అని కరాఖండిగా తేల్చిచెప్పారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్న 33/11 కెవి సబ్ స్టేషన్ లు సకాలంలో పూర్తి చేసి రైతులకు ట్రాన్స్ఫార్మర్‌లు బిగించి విద్యుత్ కనెక్షన్ లు చేయాల ని విద్యుత్ శాఖ ఎస్.ఈ ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు ఏ రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అర్హులైన లబ్ధిదారుల కు మాత్రమే మంజూరు చేయాలని, అర్హత లేని వారికి మంజూరు చేస్తే సంబంధిత అధికా రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ను ఆదేశించారు.
దావాజిపల్లి నుండి పుల్గర్ చర్ల వరకు డబు ల్ రోడ్డు నిర్మాణానికి రూ. 37 కోట్లు మం జూరు చేయనున్నట్లు తెలియజేశారు. వర్షాలకు ఎక్కడైనా కాలువలు, కుంటలు తెగినట్ల యితే మరమ్మతు కొరకు నివేదిక ఇవ్వాలని సూచించారు. డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, వి ద్యుత్ శాఖ ఎస్. ఈ. రాజశేఖరం, డి. ఈ శ్రీ నివాసులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికా రి అఫ్జల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సు ధారాణి, తహసిల్దార్ లు సత్యనారాయణ రె డ్డి, ఎంపీడీఓ గోవింద రాజు, కాంగ్రెస్ నా యకులు తదితరులు పాల్గొన్నారు.