calender_icon.png 11 September, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ కోసం రైతుల వినతి

04-09-2025 12:00:00 AM

ఎంపీ ఈటల, ఎమ్మెల్యే చామకూరకు వినతిపత్రం అందజేత

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : ఉమ్మడి ఘట్ కేసర్ మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీ చేయాలని ఘట్ కేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయం నుంచి రైతులు ర్యాలీగా బయలుదేరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి లను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఘట్‌కేసర్  రైతు సేవా సహకార సంఘంలో సాగు పెట్టుబడుల నిమిత్తం సుమారు 1,189 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2లక్షల వరకు ఋణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఈవిషయంపై అనేక సార్లు రుణమాఫీ బాధిత రైతులు సొసైటీ చైర్మెన్, ఎండీని రుణమాఫి చేయాలని కోరగా నిధులు విడుదల కాగానే చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో ఘట్ కేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి కన్వీనర్ కంట్లం గౌరీ శంకరప్ప, బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, జన సమితి జిల్లా నాయకులు మారం లక్ష్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.