calender_icon.png 11 September, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక మండపాలలో మహిళాలకు చీరల పంపిణీ

03-09-2025 11:22:58 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వినాయక మండపాలలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ మామిండ్ల రాజు. హనుమకొండ న్యూ శాయంపేట గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 31డివిజన్ లొ వున్నకాలనీలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో ఉన్న మహిళాలకు సుమారుగా 2100 పైచిలుకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. కార్పొరేటర్ మామిండ్ల రాజు మాట్లాడుతూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మున్సిపల్ కార్మికులకు, ఆర్పిలకు, అంగన్వాడీ కార్యకర్తలకు, చీరలు పంపిణీ కార్యక్రమం చేశాను.

గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రతి ఆడపడుచుకు చీరలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అందుకే సుమారుగా 2100  చీరలు నా స్వంత ఖర్చుతో పంచానని చెప్పడం జరిగింది. కుంకుమ పూజ కార్యక్రమంలో, కోలాట నృత్యంలో భాగంగా, సమూహంగా పూజలు చేసే సమయంలో ఒకే రకమైన డిజైన్, ఒకే రకమైన కలర్, చీరలు ధరించి కులమత బేధం లేకుండా ఊరు, వాడ అంతా కలిసి ఒకే కుటుంబంల కలిసి మెలిసి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని ఆయన వివరించడం జరిగింది.