calender_icon.png 11 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలగంగాధర్‌తిలక్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

04-09-2025 12:00:00 AM

  1. రాష్ట్రంలోనే తొలిసారిగా గణేష్ దీక్ష చేపట్టడం ఆదర్శం
  2. మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి):  హిందువులలో ఐక్యత చాటేందుకు ఆనాడు బాల గంగాధర్ తిలక్ వినాయక విగ్రహాల ప్రతిష్టపన మహోత్సవాన్ని ప్రారంభించారని, ఈ మహోత్సవానికి మరింత పవిత్రతను పెంచేందుకు యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గణపతి దీక్ష చేపట్టిన దీక్ష దారులకు ఆయన స్వగృహంలో బుధవారం భిక్షను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రామన్న మాట్లాడు తూ... జిల్లాలో మున్నూరు కాపు సోదరులతో పాటు ఇతర కులస్తులు 11 మందితో తొలిసారిగా ప్రారంభమైన గణపతి దీక్ష రానున్న రోజు ల్లో వేలకు చేరేలా దీక్ష తీసుకునేందుకు యువ త ముందుకు రావాలన్నారు.

ఈ దీక్షలతో గణేష్ నవరాత్రులకు మరింత పవిత్రత పెరుగుతుందన్నారు. వినాయకుని విగ్రహ ప్రతి ష్టాపన నుండి నిమజ్జనం వరకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పండగలు భక్తిప్రప త్తులతో జరుపుకోవాలని సూచించారు.