18-08-2025 10:33:25 PM
మాజీ ఎంపీపీ పోలగోనీ సత్యం
మునుగోడు,(విజయక్రాంతి): తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మునుగోడు మాజీ ఎంపీపీ పోలగోనీ సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు.
రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిదన్నారు. పేద, బడుగు బలహీనవర్గాలపై జరిగిన అన్యాయాలపైన పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.