calender_icon.png 27 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతన్నల పడిగాపులు

27-08-2025 01:16:38 AM

- పీఏసీఎస్ కేంద్రాల దగ్గర బారులుతీరుతున్న రైతులు

- వ్యవసాయ పనులు వదులుకుని నిరీక్షణ

- ముందస్తు అంచనా ఏమైంది? 

- ఇబ్బందులు పడుతున్న రైతాంగం

- అయిజ పిఏసిఎస్ కార్యాలయం ముందు నో స్టాక్ బోర్డు దర్శనం

- బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్న యూరియా పట్టుకున్న అధికారులు

 గద్వాల, ఆగస్టు 26 ( విజయక్రాంతి ) :  వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు యూరియా కొరత కలవరపెడుతోంది. ఆరంభం నుంచి పంట చేతికి వచ్చే వరకు వివిధ దశల్లో యూరియాను వాడుతూనే ఉంటారు. గద్వాల వనపర్తి జిల్లాలలో యూరియా కోసం అనేక ఇబ్బందులను పడుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరికి యూరియా వంటి ఎరువులు తప్పని సరి అయ్యింది.

కాగా రైతుల డిమాండ్ కు తగ్గట్టు అధికారులు ఎరువులను అందించకపోవడంతో రైతులు ప్రతిరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి పంట సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే రైతుల డిమాండ్ కు తగ్గట్టు అందించడం లేదన్న విమర్శలు సై తం బహిరంగంగా వినిపిస్తున్నాయి.

ము ఖ్యంగా వనపర్తి జిల్లాలో అమరచింత ఆత్మకూర్, గద్వాల జిల్లాలో గద్వాల మండలం, గట్టు, కేటీదొడ్డి, ఐజ తదితర మండలాలలో పంట కు సరిపడా ఎరువులు లేక రైతన్నలు అవస్థలు పడుతున్నారు.  వనపర్తి, గద్వాల జిల్లాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు, వారంలో నాలుగు రోజులు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎరువుల దుకాణాలు సందర్శించి తనిఖీ లను నిర్వహించి పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

 పీఏసీఎస్ కేంద్రాల దగ్గర బారులుతీరుతున్న రైతులు 

యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వచ్చే యూరియా లారీల లో సగం మంది రైతన్న లకు యూరియా అందడం మిగిలిన రైతన్నలు నిరీక్షణ తప్పడం లేదు. దింతో ఒక్కో రైతుకు రెండు బస్తాలు చొప్పున యూరియాను పంపిణీ చేస్తున్నారని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

 ముందస్తు అంచనా ఏమైంది ? 

 వ్యవసాయ అధికారులు వానాకాలం పంటకు సంబంధించి ఏ రైతు తనకున్న భూ మిలో ఎంత మేర ఏ పంటను వేస్తున్నారు వంటి విషయాలను క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు సందర్శించి ప్రణాళికను తయారు చేయడం పంటకు కావలసి న యూరియాల సైతం అంచనాలు సిద్ధం చేసి జిల్లా ఉన్నత అధికారులకు అక్కడినుం డి రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు పం పించడం జరుగుతుంది. గత సీజన్ కంటే ఏడాది మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ పెరిగిన విషయం తెలిసిన అధికారులకు యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు 

 రైతులకు నో స్టాక్ బోర్డు దర్శనం

గద్వాల జిల్లా అయిజ మండలం కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేం ద్రం కార్యాలయం ముందు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేనందు న అధికారులు రైతులకు సమాధానం చెప్పలేక నో స్టాక్ అని బోర్డు పై రాసి పెట్టడం చోటు చేసుకుంది. 

 బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్న యూరియా పట్టుకున్న అధికారులు

 తెలంగాణ కర్ణాటకకు సరిహద్దు ప్రాం తంగా ఉన్న గద్వాల జిల్లా మీదుగా యూరి యా బ్లాక్ మార్కెట్ కు గుట్టు చప్పుడు కా కుండా తరలిస్తున్నారన్న వినిపిస్తున్నాయి. ఈనెల 23న గట్టు మండలంలోని మలగరా చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక మార్కెట్కు తరలి వెళ్తున్న తెలంగాణ ఎరువులను 76 బస్తాలను మార్కెటింగ్ సిబ్బంది పట్టుకున్న విషయం తెలిసిందే. 

యూరియా కోసం నిలబడాల్సి వస్తుంది 

టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో యూరియా కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఈ ప్ర భుత్వంలో యూరియా కోసం లైన్ లో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది

 గోవిందమ్మ గుంటుపల్లి, గద్వాల మండలం 

 ముందస్తు విత్తనం వల్లే యూరియా సమస్య 

 సాధారణంగా జూన్ నెలలో రావాల్సిన విత్తనం ఏడాది వాతావరణ మా ర్పుల వల్ల మే నెలలోనే విత్తనం రావ డం వల్ల యూరియా సమస్య కాస్త ఏర్పడింది. గత సంవత్సరం వానాకాలంలో రూ.137,000 ఎకరాల సాగు చేయగా ఈ ఏడాది లక్ష 70 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాకు 14,491 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికే 14,525 మెట్రిక్ టన్నులు అందించడం జరిగింది. కాగా ఈ నెల చివరి నాటికీ 2961 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ నెలలో 5400 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం పడుతుంది. 

 సక్రియ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గద్వాల