27-08-2025 01:18:12 AM
- ప్రభుత్వ అధికారి పర్యవేక్షణ చేయాలి
- ఉమ్మడి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్ ఆగస్టు 26 (విజయ క్రాంతి) : రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని ఎవరు ఆందోళన చెందకూడదని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాం స్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. మంగళ వారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉమ్మడి మ హబూబ్ నగర్ జిల్లా ఎం.ఎల్.సి.లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్.పి.లు, వ్యవసాయ అధి కారులు, సహకార శాఖ అధికారులతో యూరియా సరఫరాపై మంత్రి జూపల్లి కృ ష్ణారావు సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరియా సరఫరా లో ఎటువంటి అవకతవకలు జరిగినా,దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించిన అటువంటి ఎరువుల డీలర్ లపై,నకిలీ విత్తనాలు విక్రయించిన ,అధిక రేటుకు విక్రయించిన వారి పై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లు,ఎస్. పి.లను ఆయన ఆదేశించారు.
యూరియా పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయని వాస్తవంగా కేం ద్రం నుండి రావాల్సిన 9 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటివరకు 5.72 లక్షల మెట్రిక్ టన్నుల యూ రియా వచ్చిందని ఇంకా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందని తెలిపా రు. పూర్తిగా యూరియా వస్తే రైతులకు ఎ టువంటి ఇబ్బంది రాదని తెలిపారు.
రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్రంతో,కేంద్ర మంత్రులతో మాట్లాడి వెంటనే యూరియా రాష్ట్రాని కి వచ్చేలా ఆన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు యూరియా విక్రయిస్తూ యూరియాతోపాటు గ్రాన్యూల్స్ కొంటేనే ఇస్తామని చెబుతున్నారని అలాంటి షాపులు కానీ సొసైటీలలో కానీ అధిక ధరలకు విక్రయిస్తే వాటిని వెంటనే సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. . రైతులలో యూరియా దొరకదేమో అనే భయాం దోళనలు ఉండకుండా వారికి నచ్చ చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఎం.ఎల్.సి
కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి,దేవరకద్ర
శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,అచ్చంపేట శాసన సభ్యులుచిక్కుడు వం శీ కృష్ణ,నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి,గద్వాల శాసన సభ్యు లు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,నారాయణ పేట శాసన సభ్యురాలు చి ట్టెం పర్ణికా రెడ్డి,వనపర్తి శాసన సభ్యులు తూ డి మేఘా రెడ్డి, డి.సి.సి. బి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి లు పాల్గొన్నారు.