calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3వ తెలుగు మహాసభలకు రండి

24-09-2025 12:43:44 AM

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ఆహ్వానించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఏపీలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3,4,5తేదీల్లో గుంటూరు అమరావతిలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిని పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు.

జనవరి 5వ తేదిన ఉదయం 10 గంటలకు మహాసభలలో భా గంగా జరిగే “ఆంధ్ర వైభవం” సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు సాహితీ, సాంస్కృతిక, సేవా రంగ ప్రముఖులకు “ఆంధ్ర శ్రీ, ఆంధ్ర సారస్వత భూషణ, ఆంధ్ర సారస్వత రత్న” పురస్కారాలను అందజేసి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని కోరా రు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి రామచంద్ర రాజు తెలిపారు.