24-09-2025 12:42:21 AM
నంగునూరు, సెప్టెంబర్ 23: నంగునూరు మండలం,సంతోష్నగర్ (గట్లమ ల్యాల) గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడటం తో ఓ రైతు కుటుంబానికి తీవ్ర నష్టం వా టిల్లింది. ఎంతో కష్టపడి పెంచుకున్న ఏ డు మేకలు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాయి.గ్రామానికి చెందిన రైతు ఎర్గదిండ్ల సాయిలు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.సాయిలు తన మేకలను మేత కోసం పొలంలోకి తోలుకెళ్లగా,ఆకస్మికంగా భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో, పిడుగు పడటంతో ఏడు మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో తన జీవనోపాధిని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోం ది.పిడుగుపాటుకు మృతి చెందిన మేకల వద్ద కూర్చుని ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది.ఈ కష్ట సమయంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తాము ఈ నష్టం నుంచి కోలుకోలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.