calender_icon.png 24 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులు ఆధైర్యపడొద్దు

24-09-2025 12:44:48 AM

  1. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుంది
  2. అవసరమైతే రోడ్డుబాట పడతాం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు
  4. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చలగాటమాడుతుంది
  5. ఎమ్మెల్సీ అంజిరెడ్డి

ముషీరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): నిరుద్యోగులు ఆధైర్యపడొద్దని మీకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. మీకు తోడుగా రోడ్డుబాట పడతామని ఉద్యమాన్ని ముం దుకు తీసుకు పోతామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం చిక్కడపల్లిలోని హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయానికి ఆయన చేరుకుని నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాం చందర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ సమ స్య పది సంవత్సరాలుగా ఉందన్నారు. అధికారంలోకి రావడానికి ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించి దాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ గ్రూప్-1 పరీక్షను నిర్వహించలేకపోయిందన్నారు.

11 సంవత్సరా లుగా ఒక్క గ్రూప్ -1 నోటిపికేషన్ నియామకం జరగలేదన్నారు. బీజేపీ నిరుద్యోగుల పక్షాన నిలుస్తుందని, గతంలో బీజేవైఎం నా యకులు ఆరెస్ట్ అయితే తాను బెయిల్ ఇప్పించానన్నారు. రాష్ట్రంలో కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యో గ నియామకం చేపట్ట లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా రో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

చేశారు. నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఉద్యోగ నియామకాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్ర భుత్వం పట్టించుకోవడం లేదని రాంచందర్ రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు బీజేపీ పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని అయితే దీన్ని రాజకీయం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్‌రావు సహకారంతో కోర్టులో కొట్లాడుతామని తెలిపారు.

రామచందర్ రావు వెళ్ళిపోయిన తర్వాత నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ దీక్షకు మద్దతు పలుకుతూ లైబ్రరీలో బైఠాయించి నినాదాలు చేశారు. రేపు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు నినాదాలు చేశారు.

ఈ సంద ర్భంగా లైబ్రరీ ఆవరణలో చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కు తమ సమస్యలు వివరిస్తున్న సందర్బం లో నిరుద్యోగ విద్యార్థులు ఒకరితో ఒకరు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడకుండా రామ్ చందర్ రావు,  పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.