26-09-2025 12:34:48 AM
భీమారం, సెప్టెంబర్ 25 : ప్రభుత్వం అందించిన విత్తనాలతో పంట పండించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని చెన్నూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) బానోత్ ప్రసాద్ కోరారు. గురు వారం మండలంలోని మద్దికల్ గ్రామంలో ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా వరి విత్తన సంచులను ఇచ్చిన రైతుల పంట పొలాలను సందర్శించి రైతులకు పలు సలహాలు అందించారు.
వరి పంటలోని బెరుకులను ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. క్షేత్ర పర్యటనలో వరిలో ఆకుముడుత, పురుగు, బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు గమనించామని, నివారణకు సూచనలు చేశారు. ఆకు ముడత నివారణకు క్లోరాంత్రానిలిప్రోల్ 60 ఎంఎల్ ఎకరానికి, బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు నివారణకు హెక్సా కొనసాల్+వాలిడామైసిన్ 400 ఎంఎల్ ఎకరానికి కలుపుకొని పిచికారి చేయాలన్నారు.
అలాగే పంట విత్తనం కావాల్సిన రైతులకు నాణ్యమైన విత్తనాన్ని విక్ర యించాలని సూచించారు. ఏడీఏ వెంట మం డల వ్యవసాయ అధికారి అత్తె సుధాకర్ వర్మ, రైతులు తదితరులున్నారు.