23-05-2025 01:27:31 AM
గూడూరు.మే 22: (విజయ క్రాంతి ) వచ్చే సీజన్ కు డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అమ్మాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విత్తన డీలర్లకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతి పత్రాలు అన్నీ కూడా అందరికీ కనిపించే విధంగా గోడకు తగిలించాలని నల్లబోర్డు తప్పనిసరిగా వ్రాయాలని యూరియా మరియు ఇతర ఎరువులు వివరాలు మరియు ధరలు స్పష్టంగా వ్రాయాలని అన్నారు అదేవిధంగా నిల్వ పుస్తకాలు ప్రతిరోజు వ్రాయాలని ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు.
పి ఓ ఎస్ లోనే రసాయనిక ఎరువులు ఎకరాలు జరపాలని రసాయనిక ఎరువులకు రైతులు కాకుండా వేరే వ్యక్తి వచ్చిన అప్పుడు రైతు మరియు వచ్చిన వ్యక్తి ఆదర్శం కి నమోదు చేసి ఎరువులు రిపేర్ జరపాలని అన్నారు నిలువలు సరిపోవాలి పీసీ లేదా ఓ ఫామ్స్ ఉన్న కంపెనీ మందులు మాత్రమే విక్రయాలు జరపాలని ప్రతినెల 1వ తేదీన మీ విక్రయాలను రాతపూర్వకంగా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.
మార్పులు చేర్పులు నమోదు చేసేటప్పుడు తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారిచే సంబంధిత పత్రాలను దృవీకరించాలని ఆ తర్వాతనే అంతర్జాలంలో నమోదు చేయాలని కోరారు ఏదైనా దరఖాస్తు చేసేటప్పుడు మీ లెటర్ ప్యాడ్ పైన రాసి ఇవ్వాలని ప్రతి నెల మీ సీట్ క్రయవిక్రయాలు ఐదవ తేదీ లోపల ఫామ్ డి లో తప్పనిసరిగా పూరించాలని అన్నారు.
ఎమ్మార్పీ ధరలకు మాత్రమే నాణ్యమే నిరువులు విత్తనాలు విక్రయించాల ని ఒకవేళ ఈ పైన వాటిని ఉల్లంఘించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సాంకేతిక వ్యవసాయ అధికారి ఏఈఓ లు డీలర్స్ పాల్గొన్నారు.