calender_icon.png 23 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య యాజమాన్యానికి నోటీసులు జారీ

23-05-2025 01:28:13 AM

చేర్యాల,మే 22:  గుర్తింపు లేని పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు  నోటీసులు నోటీసులు జారీ చేశారు. చేర్యాల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలకు ఇటువంటి గుర్తింపు లేకున్నా, గుర్తింపు ఉన్నట్టు ప్రజలను మభ్యపెడుతూ విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి రచ్చ కృష్ణయ్య ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల, ఓక్లే పాఠశాలకు నోటీసులను అందజేశారు.

ఈ పాఠశాలలకు సీబీఎస్సీ అనుమతి లేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో గుర్తింపు లేని పాఠశాలల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం రోజు పలు పాఠశాలను తనిఖీ చేసి, గుర్తింపు లేని పాఠశాలల నోటీలు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేసిన మన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించోద్దని సూచించారు.