11-07-2025 10:19:01 PM
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
కొండపాక: సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజిరెడ్డి లతో కలసి శుక్రవారం కొండపాక మండలం బందారం గ్రామంలోని రాజిరెడ్డి అనే రైతు తోటను సందర్శించారు. సేంద్రీయ పద్ధతిలో కాకర, బీర పంటలను పండిస్తున్నారు. రైతులకు ఉద్యాన పంటలను వివరించి, వాటి పెంపకానికి రైతులు ముందుకు రావాలని, ఈ పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.