calender_icon.png 12 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాలలో పీఆర్టియు సభ్యత్వ నమోదు

11-07-2025 10:23:36 PM

చిట్యాల,(విజయక్రాంతి): సభ్యత్వ నమోదు కార్యక్రమం మండలంలో విజయవంతంగా కొనసాగుతుందని పిఆర్టీయు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాస్, సూదం సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్టియు జిల్లా శాఖ ఆదేశంమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలను తమ దృష్టికి తీసుకునివస్తే పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. జూకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, నైన్ పాక ఉన్నత పాఠశాల, గోపాల్ పూర్ ఉన్నత పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా పూర్తి అయిందన్నారు.