04-10-2025 07:03:42 PM
లేనియెడల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ హామీలను ఎండగడతాం..
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్..
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్టం కొరకు పోరాటాలు చేసిన మలిదశ ఉద్యమకారులను అవమానపరిచిన ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజల్లో ఎండబెడతామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ బాన్సువాడ మండల అధ్యక్షులు గంజివార్ చందు లు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఏ నాయకులు పట్టించుకోలేదు గత 10 సంవత్సరంల పాలనలో మరిచిపోయిన నాయకులు తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత అప్పటి నాయకులు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత ఎన్నికల 2023 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పి నేటికీ 2 సంవత్సరంలు గడుస్తున్న అసెంబ్లీలో ఉద్యమకారుల ఆశయాల గురించి మాట్లాడిన దాకలలు లేవు ప్రస్తుతం రాష్టంలో కొంతమంది నాయకులు వారి వారి అవసరాల కొరకు పార్టీలు మారుతున్నారే కానీ ఉద్యమకారుల మనోభావాల గురించి ఏ ఒక్క నాయకుడు కూడ న్యాయం చేసే పరిస్థితి లేదు మీది మాటలు ఎంత తీయగా వున్న ఉద్యమకారుల మనోభావాల గురించి నాయకుల మనుసులో ఇప్పటికి లేదు ఇది చేసాం అది చేసాం అని గొప్పలు చెప్పుకొనే నాయకులు ఇప్పటికైనా మీ కోసం కష్టపడ్డా ఉద్యమకారుల ఆశయాలను గ్రయించి ఉద్యమకారులకు న్యాయం చేయగలరని ప్రస్తుత MLAకి బాన్స్ వాడ ఇంచార్జ్ కి విన్నవించుకుంటూ ఇప్పుడైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి స్వరాష్ట్రము కొరకు పోరాటాలు చేసిన వారిని గుర్తించి న్యాయం చేస్తారని ఆశించుచున్నాము లేని యెడల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వానికి ఉద్యమకారులకు తగిన బుద్ధి చెప్తామని వారు పేర్కొన్నారు.