calender_icon.png 26 July, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్య పడవద్దు

26-07-2025 12:00:00 AM

రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 

నిర్మల్, జులై 25 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఎలాంటి అధైర్యం పడవద్దని జిల్లాలోనే పరిశ్రమ నిర్మాణం చేపడతామని రాష్ర్ట వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అ న్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఆయనను హైదరాబాద్ లోని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

నిర్మల్ జిల్లాలో ఆయి ల్ ఫామ్ పంటను రైతులు అధిక మొత్తంలో సాగు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోన్ మండలం పాక్ పట్ల గ్రామ సమీపంలో పరిశ్రమ నిర్మాణానికి 40 ఎకరాల భూ సేకరణ జరిగిందని, పరిశ్రమను ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిర్మల్ జిల్లాలోనే పరిశ్రమ ఏర్పాటు అయ్యేలా చూడాలని విన్నవించారు.

అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి నిర్మల్ లోనే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, నాయకులు రాజేశ్వర్, నరేష్ రెడ్డి తదితరులున్నారు.