calender_icon.png 25 July, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఎరువుల కొరత రావద్దు!

24-07-2025 12:38:59 AM

ఫర్టిలైజర్ షాపుల యజమాన్యాలను హెచ్చరించిన ఆర్డీవో

తూప్రాన్, జులై 23 : తూప్రాన్ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్ కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలం సీజన్ లో రైతులకు కావలసిన యూరియా, ఇతరత్రా ఎరువుల విషయంలో ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యాలు ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించరాదని హెచ్చరించారు.

రైతులకు ఎరువులను సమకూర్చి వారికి అందించాలన్నారు. ఓల్ స్టాక్ గోదాములలో ఉంచరాదన్నారు. ఒకవేళ ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ శివానందం, అధికారులు, పోలీస్ సిబ్బందిఉన్నారు.