calender_icon.png 25 July, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనికుడిలా పనిచేస్తా...

24-07-2025 12:37:56 AM

  1. అభివృద్ధి కోసం ముందడుగు 

పేదింటోళ్ళకి ఆణిముత్యం

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడైన స్వప్నభాస్కర్ 

విద్యార్థులకు అండగా ఉంటా 

పేదకుటుంబాలకు ఆర్థిక సహాయాలు

సొంత ఖర్చులతో మండల కేంద్రం లో సౌకర్యాలు

గోపాలపేట జూలై 23: గ్రామానికి ఈ అ వసరమైన ఉంటే తక్షణమే వచ్చి పనిచేసేందుకు సైనికుడిలా వస్తా అంటున్న కర్రోళ్ల స్వ ప్న భాస్కర్.. గ్రామంలో ఏసమస్యలు వచ్చి న ప్రజలు నన్ను కోరితే వెంటనే వచ్చి వారికి సహకరిస్తా అంటున్న యువకుడు స్వప్న భా స్కర్. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల భాస్కర్ తాను కష్టపడి చదివి విద్యుత్ శాఖలో కొలువు సంపా దించాడు.

కానీ తాను కష్టపడినట్లు ఎవరికి కూడా ఈ కష్టం రావద్దని ప్రతి నిరుపేద వి ద్యార్థికి చదువుకోవడానికి తనవంతుగా స హాయం చేయడం గమనార్హం. విద్యుత్ శాఖ లో కొలువు చేస్తూ సంపాదించిన దాంట్లో కొద్దిగా పేద ప్రజలకు ఆర్థిక సహాయాలు చే యడం శోచనీయం. గత ఐదేళ్లుగా గ్రామం లో ఉన్న పేదవారిని ఆదుకుంటూ వస్తున్నా డు. నేటికీ మృతిచెందిన కుటుంబాలకు అండగా ఓ ఆణిముత్యంలా సహాయం చే స్తూ ఇప్పటికినీ చేస్తూనే ఉన్నాడు గత ఐదేళ్ల నుండి సుమారుగా 15 లక్షల దాకా పేద కుటుంబాలకు అందజేయడం పట్ల ప్రజల్లో మన్నలతో పాటు అభినందించబడ్డాడు.

భా స్కర్ అంటూ తలుపు తడితే చాలు తక్షణ స హాయం అందాల్సిందే. ఇలాంటి యువకు డు ప్రతి ఒక్కరికి ఓ ఆదర్శంగా నిలుస్తున్నా డు. భాస్కర్ చదువుకున్న పాఠశాలకు ఎం తో ఖర్చు చేయడం గొప్ప విషయం. ప్రభు త్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే కదా చదువుకోవడం అంటూ ఆ విద్యార్థుల కోసం మంచి తాగునీరు అందించాలన్న సంకల్పం తో వాటర్ ప్లాంట్ ఇప్పించారు.

అంతేకాకుం డా బోరు పంపు పని చేయకపోవడం దానికి కావలసిన పనిముట్లను ఏర్పాటు చేసి నీటినందించారు. అంతేకాకుండా విద్యార్థులకు క్రీడా సామాగ్రి తో పాటు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను కూడా కొనుగోలు చేసే అందించారు. అదేవిధంగా కొన్ని కాలనీలలో మురుగు కాలువలు లేని చోట్ల భూ కాలను తవ్వించడం. తాగునీరు ఇబ్బంది ప డుతున్నారని బోరు సైతం వేయించడం గౌరవించదగ్గ విషయం మంటున్న ప్రజలు.

ము ఖ్యంగా తన తోటి స్నేహితులు ఆకస్మిక మరణాలు చెందుతే వారిని ఆదుకోవడం తోపా టు అంతక్రియల్లో పాల్గొని నేనున్నానంటూ తన భుజాలపై మూసుకొని అంత్యక్రియలు జరిపిస్తున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకోవడంతో పాటు అధికారులకు భోజనం ఏర్పాట్లను చే యించడం గొప్ప విషయం. గోపాలపేట మండల కేంద్రానికి చెందిన ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబానికి 5000 రూపాయలను అందజేస్తూ వస్తున్నారు.

అంతేకా కుండా స్మశాన వాటిక వద్ద ఎవరైనా అక్కడికి వెళితే నీరు లేదని తెలపడంతో బోరు త వ్వించడం, గోపాలపేట గ్రామానికి తాను ఆ ర్థిక సహాయం చేయడంలో తన భార్య స్వప్న తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరు వారిని అ భినందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ని మనం కోరుకుంటే మన గ్రామం ఇంకా బాగుపడుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. స్వప్న భాస్కరులు ఏ కాలనీకి వెళ్లిన వారికి ఆహ్వా నం పలికి దీవించడం గొప్ప విషయం. 

ప్రజల మనసులో ఆపద్బాంధవుడు: మతిన్, గోపాలపేట 

గోపాలపేట.. గ్రామానికి ఇలాంటి వ్యక్తు లు ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే కా కుండా గ్రామాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు సిద్ధమైన ఇలాంటి వ్యక్తిని ప్రజలు మ నసులో ఆపద్బాంధవుడిగాపిలుచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులను మన గ్రామ ప్రజలంతా ఆదరించి ఓ స్థాయిలో నిలబెడితే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాడీ ఈ ఆపద్బాంధవుడు.

ప్రజల కోసం ముందుకు రావడం సంతోషం: బాలరాజు,గోపాలపేట 

హైదరాబాదులో ఉంటూ గోపాలపేట ప్రజలకు సేవలు అందిస్తూ ఎన్నో సేవా కా ర్యక్రమాల్లో పాల్గొంటూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు రావడం గొప్ప విషయం.

ప్రజలు దీవిస్తే జిల్లాలోనిఆదర్శ మండలంగా మారుస్తా...  

పదేళ్ల నుండి గోపాలపేట గ్రామానికి ఎన్నో సేవలు అందించాను. ఎంతోమందిని ఆదరించాను. ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశాం ముఖ్యంగా సమస్యల ను నెలకొంటున్న కాలనీవాసులకు ఊర ట కల్పించా అంతేకాకుండా గ్రామంలో ఏ కుటుంబం లో మృతి చెందిన కూడా అంత్యక్రియల కోసం 5000 రూపాయలను వెంటనే అందజేశాను.

అదేవిధం గా విద్యార్థుల కోసం చెప్పనక్కరలేదు కాబట్టి నేను పుట్టిన ఈ గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలని తన వంతుగా సేవతోపాటు సహాయం చేసుకుంటూ వస్తు న్నాను గ్రామ అభివృద్ధి నా ధ్యేయం ప్రజలంతా నన్ను ఆదరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధిలోకి తెచ్చి జిల్లాలో ఆదర్శ మండలంగా మారుస్తా

స్వప్న భాస్కర్ గోపాలపేట