calender_icon.png 21 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు నానో యూరియాను వాడుకోవాలి

21-08-2025 01:18:49 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్ 

తాడ్వాయి, ఆగష్టు, 20( విజయ క్రాంతి): రైతులు నానో యూరియాను వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్  తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల, సంతాయిపేట, తాడువాయి గ్రామాలలో ఆయన బుధవారం వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువ మోతాదులో యూరియాను వాడడంతో పంటలకు అనేక నష్టాలు జరుగుతున్నాయని తెలిపారు.

వరి, మొక్కజొన్న పంటలకు అధిక మోతాదులో యూరియా ఎరువులు వాడడం తో పంటలకు చీడపీడలు ఎక్కువవుతున్నాయని తెలిపారు రైతులు అధునాతన పద్ధతిలో నానో యూరియాను పంటలకు పిచికారి చేసుకోవాలని సూచించారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుందని తెలిపారు. ఈ నానో యూరియాను వాడుకున్నట్లయితే రైతులు మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చునారు. ఒక ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యురియా సరిపోతుందని తెలిపారు. 

రైతు పొలంలో నానో యూరియాను పిచికారి చేయాలంటే సాధారణంగా ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు ఒక రోజులో పిచికారి చేయగలుగుతారన్నారు కానీ డ్రోన్ పద్ధతిలో ఒక రోజులో 50 నుంచి 70 ఎకరాల వరకు నానో యురియాను పంటలకు పిచికారి చేయవచ్చని సూచించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డ్రోన్ పద్ధతిలో నానో యూనియన్ ఎలా పిచికారి చేయవచ్చు అనే పద్ధతులు రైతులకు చూపించారు.

యూరియా ఎక్కువగా  పంటలకు వాడడంతో పంటలకు చీడపీడలు రావడం, భూసారం దెబ్బ తినడం లాంటి ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు రైతులు ఇకముందు యూరియా ఎరువు వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, తాడువాయి మండల వ్యవసాయ అధికారి నర్సింలు, తహసిల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజిద్ అలీ, ఏఈవోలు పాల్గొన్నారు.