calender_icon.png 21 August, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో రుణాలను చెల్లించాలి

21-08-2025 01:20:15 AM

కామారెడ్డి ఐకెపి ఐబి డిపిఎం శ్రీనివాస్

గాంధారి, ఆగస్టు 20 (విజయ క్రాంతి):  మహిళా సంఘాల సభ్యులు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించాలని కామారెడ్డి ఐకెపి ఐబి డిపిఎం శ్రీనివాస్ ఆన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్    గ్రామంలోని రైతు వేదికలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జన సంరక్షణ సురక్ష జీవిత బీమా పై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అయినా ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ డ్వాక్రా సంఘంలోని ప్రతి మహిళ పొదుపు చేయడం బకాయిలను చెల్లించడం, సురక్ష జీవిత బీమా కలిగి ఉండడం ముఖ్యమని అని సూచించారు.

భీమ యొక్క ప్రాముఖ్యత తీసుకోవడానికి ప్రాముఖ్యత గల అంశాలను మహిళా సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం ప్రసన్నకుమార్ సీసీలు కాంతి రెడ్డి,భూమన్న, రాజయ్య, రాజు, ఐకెపి వివోఎ ల సంక్షేమ సంగం వ్యవస్థాపక అధ్యక్షులు గౌస్ ఖాన్ ,మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.