calender_icon.png 27 December, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలి

27-12-2025 02:12:53 AM

ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసిన ముథోల్ ఎమ్మెల్యే

భైంసా, డిసెంబర్ ౨౬ (విజయక్రాంతి): భైం సా మండలంలోని చీరాల ప్రాజెక్టు నుంచి యాసంగి రైతులకు శుక్రవారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నీటిని విడుదల చేశారు. 12 కోట్లతో ప్రాజెక్టు అభివృద్ధి పనుల ను పూర్తి చేయడం జరిగిందని శాశ్వత కాలం లో నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.

600  ఎకరాలు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, రైతులు పొదుపుగా నీటిని వినియో గించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మహిళా సంఘానికి నిధులు మంజూరు

నర్సాపూర్ జీ మండలం గొల్లమాడ మహి ళా సంఘానికి రూ.20 లక్షల నిధులు మం జూరు పత్రని మాజీ ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి గ్రామస్తులకు అందజేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు సంఘ భవనానికి 20 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయ న తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.