calender_icon.png 29 August, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి మండపాలకు క్యారమ్ బోర్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

28-08-2025 05:51:06 PM

హనుమకొండ (విజయక్రాంతి): టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం బాలసనుద్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) చేతుల మీదుగా డివిజన్ కు రెండు చొప్పున గణపతి మండపాలకు క్యారమ్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు, సోషల్ మీడియా నాయకులు రోషన్ గైక్వాడ్, తదితరులు పాల్గొనారు.