calender_icon.png 21 August, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ప్రవాహంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

21-08-2025 06:04:06 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి మండలం జైత్ పూర్ బోర్డ గ్రామంలో సుమారుగా 10 మంది రైతులకు చెందిన 30 ఎకరాల పంట నష్టం అడా ప్రాజెక్టు నీటి ప్రవాహంతో జరిగింది. నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడంతో వాగు ద్వారా పత్తి చేనులోకి నీరు చేయడంతో పంట మొత్తం నీట మునగడంతో రైతులకి నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి సుమారుగా ఎకరాకి 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వ్యవసాయ అధికారులు పంపించి నీట మునిగిన పంటచేళ్లను పరిశీలించి నష్టపోయిన వారికి పరిహారం అందించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, గెడం టీకానంద్, సిపిఎం నాయకులు వడ్లూరి మల్లేష్ , గ్రామ రైతులు జబోరే తిరుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.