calender_icon.png 21 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షరీఫ్ ఉస్మాన్ హదీకి అంత్యక్రియలు

21-12-2025 12:37:07 AM

ఆశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు

‘బంగ్లా’ జాతీయ కవి కాజీ నజ్రూల్ సమాధి పక్కనే ఖననం

దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా హదీ: మహమ్మద్ యూనస్

ఢాకా, డిసెంబర్ 20: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రఖ్యాత కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే శనివారం ‘ఇంక్విలాబ్ మంచో’ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అం త్యక్రియలు జరిగాయి. హదీ త్యాగాన్ని గుర్తిం చి అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశపు జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే ఖననం చేయాలని నిర్ణయించింది. ఢాకా వర్సిటీ పక్కనే ఉన్న ఈ సమాధి స్థలం వద్దకు వేలాదిగా యువత తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య హదీకి వారు అంతి మ వీడ్కోలు పలికారు.

అంతకుముందు ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ భవనం వద్ద హదీ ఆత్మశాంతికి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ సైతం పాల్గొన్నారు. హాదీ చేసిన త్యాగాన్ని స్మరించు కున్నారు. హదీ ఎప్పటికీ దేశ ప్రజల గుండె ల్లో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. 

హిందువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఘర్షణల్లో భాగంగానే గురువారం రాత్రి దుండగులు మైమన్సింగ్ జిల్లాలో దీపూ చంద్రదాస్ అనే హిందువును హతమర్చారు. ఈ కేసులో శనివారం అక్కడి పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య ఘటనపై మూక దాడులను  సహించబోమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభు త్వం హెచ్చరించింది.  

ఇరు దేశాల ఆర్మీ చీఫ్‌ల చర్చ

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్‌తో ఫోన్‌లో సంభాషించారు. బంగ్లాదేశ్‌లో భారతీయులు, వారి ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని, వారికి ముప్పు లేదని వాకర్ ఉజ్ జమాన్ స్పష్టం చేశారు.