calender_icon.png 6 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

06-05-2025 12:32:44 AM

భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న మనస్తాపం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో విషాదం

కొండాపూర్, మే 5: కుటుంబ కలహాల తో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్‌లో జరిగింది. కొండాపూర్ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ లో నివాసముంటున్న బాయికాడి సుభాష్ (45), ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

అతడికి భార్య మంజుల, కొడుకు మరియన్ (13), కూతురు ఆరాధ్య(9) ఉన్నారు. అయితే కుటుంబంలో కలహాలతో అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన సుభాష్, తన ఇద్దరు పిల్లల్ని బండరాయితో కొట్టిచంపి, ఆ తర్వాత తనూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా, మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు  భావిస్తున్నా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తండ్రి, పిల్లల మృతితో మల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.