calender_icon.png 6 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

06-05-2025 12:32:01 AM

ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్

మేడ్చల్, మే5(విజయ క్రాంతి): అంబేద్కర్ రచించిన రా జ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి విష్ణునాథ్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం లోని అల్వాల్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా  విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణునాథం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేశారని ఆయన ప్రశం సించారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కుల గణన చేయాలని రాహుల్ గాంధీ ము ఖ్యమంత్రిలకు సూచించారు అన్నారు.

తెలంగాణ బిసి కుల గణనలో ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటిం చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ ఇటువంటి పథకాలు అమలు చేస్తోందన్నారు.

సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తే మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ బి శోభారాణి ణి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగం లేకుండా చేయాలని, మాట్లాడే, కొట్లా డే హక్కులు లేకుండా కుట్ర చేస్తోందని అన్నారు.

జిల్లా కాంగ్రె స్ కమిటీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం బీసీ కుల గణన చేయాలని నిర్ణయించడానికి రాహుల్ గాంధీ కారణమన్నారు. తెలంగాణలో బీసీ కుల గణన విజయవంతమైందని, దీనికి బిజెపి ప్రభుత్వం భయపడి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని నిర్ణయించిందన్నారు.

పీసీసీ పరిశీలకులు పారిజాత నరసింహారెడ్డి, దుర్గం భాస్కర్, జై సం విధాన్ కోఆర్డినేటర్ ఉజ్మ షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ని యోజకవర్గాల ఇన్చార్జీలు వజ్రేష్ యాదవ్, కొలను హనుమంత రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, బండి రమేష్, యువజన కాం గ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, శ్రీరంగం సత్యం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

భారీ పాదయాత్ర 

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అల్వాల్లో భారీ పాదయాత్ర నిర్వహించారు. రాజీవ్ గాంధీ  విగ్రహం నుంచి ఇందిరా గాంధీ విగ్రహం మీదుగా సభాస్థలి వరకు పాదయాత్ర నిర్వహించారు. జై కాంగ్రెస్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలు చేశారు.